
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 52,319 నమూనాలను పరీక్షించగా 1,115 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. తాజాగా ఆరుగురు కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,265 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,693 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.