
కేంద్ర ప్రభుత్వం నూతనగా ఆమోదించిన జాతీయ విద్య విధానంలోని సూచనల మేరకు 6-8 తరగతి చదివే పాఠశాల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఈ నైపుణ్య శిక్షణలో భాగంగా విద్యార్థులకు 10 రోజుల పాటు ‘బ్యాగ్‌లెస్’ తరగతులు ఉంటాయని వెల్లడించారు. ఈ కాలంలో విద్యార్థులు వడ్రంగి, తోటమాలి, కుమ్మరులు, కళాకారులు వంటి స్థానిక వృత్తి నిపుణులతో ఇంటర్న్ చేయాల్సి ఉంటుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.