https://oktelugu.com/

హేమంత్ హత్య.. వెలుగు చూస్తున్న సంచలన నిజాలు..!

తెలంగాణలో మరో పరువు హత్య సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. గతంలో మిర్యాలగూడలో అమృత-ప్రణయ్ యువజంట ప్రేమ పెళ్లి చేసుకుంది. కూతురు తనకు ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుందనే పగతో ఆమె తండ్రి మారుతిరావు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించారు. ఆ తర్వాతి రోజుల్లో మారుతిరావు కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ సంఘటన మరువకముందే తెలంగాణలో మరో పరువు హత్య చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని చందానగర్ లో హేమంత్ అనే యువకుడి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 / 07:45 PM IST
    Follow us on

    తెలంగాణలో మరో పరువు హత్య సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. గతంలో మిర్యాలగూడలో అమృత-ప్రణయ్ యువజంట ప్రేమ పెళ్లి చేసుకుంది. కూతురు తనకు ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుందనే పగతో ఆమె తండ్రి మారుతిరావు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించారు. ఆ తర్వాతి రోజుల్లో మారుతిరావు కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ సంఘటన మరువకముందే తెలంగాణలో మరో పరువు హత్య చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

    హైదరాబాద్ లోని చందానగర్ లో హేమంత్ అనే యువకుడి నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన అవంతిని ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన ఆమె తల్లిదండ్రులు అవంతిని ఇంట్లోనే నిర్భందించారు. అయితే హేమంత్-అవంతి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా ఈ యువజంట చందానగర్లోని గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈక్రమంలోనే యువతి బంధువులు హేమంత్ కిడ్నాప్ ను చేసి అత్యంత దారుణంగా హతమర్చడం సంచలనంగా మారింది.

    పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి.. మేనమామ యుగంధర్ రెడ్డిలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సంచలన విషయాలను నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. హేమంత్ ప్రేమ వ్యవహారం తెలిశాక అవంతిని ఇంట్లోనే కట్టడి చేసినట్లు లక్ష్మారెడ్డి పోలీసులతో చెప్పాడు. తమ కాలనీలో తమదే ఆధితప్యమని.. అలాంటిది తన కూతురు ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోవడం తట్టుకోలేకపోయినట్లు తెలిపాడు.

    తన పరువు తీసిన కారణంగానే  హేమంత్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మారెడ్డి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. యుగంధర్ రెడ్డి సాయంతో సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే మొదట కుదుర్చుకున్న సుపారీ గ్యాంగ్ తమకు చివరి నిమిషంలో హ్యండ్ ఇవ్వడంతో కొద్దిరోజులు హత్య వాయిదా పడినట్లు వారిద్దరు పోలీసులకు చెప్పారు.

    ఆ తర్వాత బిచ్చు యాదవ్ అనే సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకొని రెక్కి నిర్వహించినట్లు తెలిపారు. పక్కా స్కెచ్ తో ఈసారి హేమంత్ ను హతమర్చినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితులు చెప్పిన వివరాలను ఆధారంగా పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. వీరికి సంఘటన స్థలానికి పోలీసులు మరోసారి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా రాష్ట్రంలో వరుసగా పరువు హత్యలు వెలుగు చూస్తుండటం భయాందోళన కలుగుతోంది. అలాగే ప్రేమ పెళ్లిళ్లు చివరికీ విషాదంగా మారుతుండటం శోచనీయంగా మారుతోంది.