
అసోంలోని తిరుగుబాటు సంస్థ దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో అసోం రైఫిల్స్, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఆదివారం తెల్లవారు జామున ధనసిరి ప్రాంతంలోని అసోం నాగాలాండ్ సరిహద్దు వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో డీఎన్ఎల్ ఏకు చెందిన ఆరుగురు మృతి చెందగా ఘటన స్థలం వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అసోం పోలీస్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ ట్వీట్ చేశారు.