Shubman Gill: హార్దిక్ పాండ్యతో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను గిల్ ఖండించారు. ప్రేమ తప్ప ఏం లేదు. ఇంటర్నెట్ లో చూసే ప్రతీ దాన్ని నమ్మకండి అంటూ హార్దిక్ తో ఉన్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో గిల్ షేర్ చేశాడు. కాగా నిన్న ముబై, గుజరాత్ ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో గిల్, హార్దిక్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. దీంతో వారి మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.