Chiranjeevi-Karthi multi starrer: సౌత్ లో ఇప్పుడు వరుసగా క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. ఒకప్పుడు ఇద్దరు హీరోలు కలిసి నటించడం పెద్ద విషయం గా భావించే వాళ్ళు ఆడియన్స్. కానీ ఇప్పుడు అది సర్వసాధారణం అయిపోతుంది. నేటి తరంలో సరిసమైనమైన స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా కలిసి మల్టీస్టార్రర్ సినిమాలు చేసేస్తున్నారు. #RRR నుండి ఈ ట్రెండ్ మరింత జోరు అందుకుంది. ఇదంతా పక్కన పెడితే సహజమైన నటనకు ప్రతిరూపాలు లాంటి ఇద్దరు హీరోలు కలిసి త్వరలోనే ఒక సినిమాలో నటించబోతున్నారు. వాళ్ళు మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మరియు కార్తీ(Karthi Sivakumar). నిన్నటి తరం సూపర్ స్టార్స్ లో మెగాస్టార్ చిరంజీవి సహజ నటన ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి ఎమోషన్ ని అయినా ఆయన అద్భుతంగా పలికించగలడు. నేటి తరం సౌత్ స్టార్స్ లో అలా సహజమైన నటన చేసే వారిలో కార్తీ కూడా ఒకడు.
తమిళం లో ఈయనకు ఎంతమంచి క్రేజ్ ఉందో, తెలుగు లో కూడా అంతే మంచి క్రేజ్ ఉంది. తెలుగు భాషని అభిమానిస్తూ, తమిళ ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ బహిరంగంగా చెప్పిన కార్తీ ని మన తెలుగు ఆడియన్స్ కూడా ఆయన్ని తెలుగు హీరోలాగానే చూస్తారు. వీళ్లిద్దరు కలిసి త్వరలోనే ఒక సినిమాలో నటించబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి తో 2023 వ సంవత్సరం లో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తెరకెక్కించిన బాబీ కొల్లి, త్వరలోనే KVN ప్రొడక్షన్స్ లో మరోసారి చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. రీసెంట్ గానే దీనికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. త్వరలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం.
అందుకోసం ఆయనకు 25 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఆఫర్ కూడా ఇచ్చారట. ఇది కార్తీ కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అనుకోవచ్చు. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం లో కూడా డైరెక్టర్ బాబీ మాస్ మహారాజ రవితేజ ని తీసుకున్నాడు. ఆయనకు ఎంత మంచి క్యారక్టర్ ఇచ్చాడో మన అందరికి తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి రవితేజ క్యారక్టర్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇప్పుడు చిరంజీవి తో చేయబోతున్న రెండవ సినిమాలో కార్తీ కూడా అలాంటి క్యారక్టర్ ని డిజైన్ చేసాడట బాబీ. ప్రస్తుతం కార్తీ ‘ఖైదీ 2’ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు సమాంతరంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ క్రేజీ రాబోయే రోజుల్లో ఎంత పెద్ద ప్రాజెక్ట్ గా మారబోతుంది అనేది.