కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీస్

హుజూరాబ్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కి చెందిన ఓ కార్యకర్తతో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి ఈ షోకాజ్ నోటీస్ ను జారీ చేశారు. గతంలోనే కౌశిక్ రెడ్డిని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది. 24 గంటల్లో ఫిర్యాదులపై వివరణ […]

Written By: Suresh, Updated On : July 12, 2021 11:23 am
Follow us on

హుజూరాబ్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కి చెందిన ఓ కార్యకర్తతో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి ఈ షోకాజ్ నోటీస్ ను జారీ చేశారు. గతంలోనే కౌశిక్ రెడ్డిని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది. 24 గంటల్లో ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్ లో క్రమశిక్షణ సంఘం పేర్కొంది. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.