కేటీఆర్ దూకుడు.. నిరుద్యోగ సమస్య తీరేనా?

తెలంగాణలో పారిశ్రామిక విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. పారిశ్రామికీకరణకు మంత్రి కేటీఆర్ చొరవతో పరిశ్రమలు తరలివస్తున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు దొరుకుతున్నాయి. కేరళకు తరలిపోయే పరిశ్రమను కేటీఆర్ ఇక్కడికి తీసుకొచ్చారు. కిటెక్స్ కంపెనీ ముందుగా కేరళలో పరిశ్రమ స్థాపించాలనుకుంది. ఇందుకు అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించింది. కానీ వారిలో పడక అది మన ప్రాంతానికి తరలి వచ్చే అవకాశం చిక్కింది. అవకాశాన్ని అందిపుచ్చుకున్న కేటీఆర్ వేగంగా స్పందించి పరిశ్రమ తెలంగాణకు రాబోతోంది. కిటెక్స్ పరిశ్రమ ప్రధానంగా టెక్స్ టైల్స్ […]

Written By: Srinivas, Updated On : July 12, 2021 11:17 am
Follow us on

తెలంగాణలో పారిశ్రామిక విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. పారిశ్రామికీకరణకు మంత్రి కేటీఆర్ చొరవతో పరిశ్రమలు తరలివస్తున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు దొరుకుతున్నాయి. కేరళకు తరలిపోయే పరిశ్రమను కేటీఆర్ ఇక్కడికి తీసుకొచ్చారు. కిటెక్స్ కంపెనీ ముందుగా కేరళలో పరిశ్రమ స్థాపించాలనుకుంది. ఇందుకు అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించింది.

కానీ వారిలో పడక అది మన ప్రాంతానికి తరలి వచ్చే అవకాశం చిక్కింది. అవకాశాన్ని అందిపుచ్చుకున్న కేటీఆర్ వేగంగా స్పందించి పరిశ్రమ తెలంగాణకు రాబోతోంది. కిటెక్స్ పరిశ్రమ ప్రధానంగా టెక్స్ టైల్స్ రంగంలో ఉంది. దీంతో వరంగల్ లో టెక్స్ టైల్ పార్కును అభివృద్ధి చేయాలని భావించిన నేపథ్యంలో కిటెక్స్ కు చాన్స్ ఇచ్చారు. ఈ పరిశ్రమ వస్తే మంచి ఊపు వస్తుందని తెలుస్తోంది.

రాష్ర్టంలో అనుకూలమైన వాతావరణం ఉంటుందని కేటీఆర్ పరిశ్రమ ప్రతినిధుల్ని పర్యటనకు ఒప్పించారు. వారి కోసం ప్రత్యేక విమానం పంపించారు. దీంతో వారు వచ్చేందుకు అంగీకరించారు మూడు రోజుల క్రితం కిటెక్స్ బృందం తెలంగాణకు వచ్చింది. అక్కడ వారికి కేటీఆర్ నే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత వారిని ప్రత్యేక హెలికాప్టర్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు తీసుకెళ్లారు.

పర్యటన ముగిసిన తరువాత కంపెనీ ప్రతినిధుల్ని నేరుగా ప్రగతిభవన్ కే తీసుకెళ్లారు. తరువాత వారికి విందు ఇచ్చారు. పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అంగీకరింపజేశారు. వెయ్యి కోట్ల పెట్టుబడితో దాదాపు నాలుగువేల ఉద్యోగాలు కల్పించనున్నారు. గతంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు ప్రభుత్వాలు హోరాహోరీగా పరిశ్రమల కోసం కొట్లాడేవి. మొదట హీరో పరిశ్రమ తెలంగాణకే వచ్చేది. చంద్రబాబు ఏపీకి తీసుకెళ్లారు. ఇప్పుడు అలాంటి పోటీ లేకపోవడంతో ఏపీ నుంచి అడ్డంకులు రాకపోవడంతో మంత్రి కేటీఆర్ పని సులువవుతుంది.

మంత్రి కేటీఆర్ చొరవతో కిటెక్స్ పరిశ్రమ రాష్ర్టంలోకి ప్రవేశిస్తే నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. మంత్రి నిర్ణయంతో తెలంగాణకు పరిశ్రమ రావడం సంతోషించదగ్గ విషయమే. మనకు రావాల్సిన పరిశ్రమలు ఎన్నో తరలి వెళ్లినా కొన్నిటినైనా మనం దక్కించుకోవాలనే తాపత్రయం ఉండడం ఆహ్వానించదగ్గ విషయమే. ఇందుకు తోడ్పడిన కేటీఆర్ ను అందరు ప్రశంసిస్తున్నారు.