SBI: దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకు ద్వారా నిత్యం కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్ ఉంటాయి. సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు ఎస్పీఐ లో అకౌంట్ ను కలిగి ఉన్నారు. ఈ తరుణంలో డెబిట్ కార్డులు కూడా పొందారు. అయితే ఎస్బీఐ డెబిట్ కార్డులు వాడే వారికి తాజాగా బ్యాంక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. దీని మెయింటనెన్స్ ఛార్జీలు పెంచనున్నట్లు తెలపింది. ఇవి 1 ఏప్రిల్ 2024 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. మరి ఆ చార్జీలు ఎలా ఉంటాయంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వివిధ రకాల డెబిట్ కార్డులను జారీ చేసింది. ఇందులో క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులు ఉన్నాయి. ఇవి వినియోగించే వారికి ప్రస్తుతం వార్షిక ఛార్జీల కింద రూ.125 వసూలు చేస్తోంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత అంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కొత్త ఛార్జీల ప్రకారం ఈ కార్డు వార్షిక ఆదాయం రూ.200 ఉంటందని పేర్కొంది. ఈ ఛార్జీలతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
ఇదే బ్యాంకు నుంచి జారీ చేసిన యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డుల వార్షిక ఫీజును రూ.175 తో పాటు జీఎస్టీని అదనంగా ఛార్జీ చేస్తున్నారు. కొత్త ఫైనాన్సియర్ నుంచి ఇది రూ.250కి పెరగనుంది. ఒకవేళ దీనికి జీఎస్టీ యాడ్ అయితే రూ.325 ఉండనుంది. అయితే మిగతా బ్యాంకులు ఛార్జీల విషయంలో ఎలాంటి విషయాన్ని చెప్పలేదు. కానీ ఎస్బీఐ ఖాతాదారులకు మాత్రం ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు రావడంతో ఆందోళన చెందుతున్నారు.
స్టేట్ బ్యాంకుకు సంబంధించి దేశవ్యాప్తగా లక్షలకు పైగా ఎటీఏంలు ఉన్నాయి. వీటిలో ప్రతి నెల 5 సార్లు ఉచితంగా నగదు విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. కేవలం నగదు విత్ డ్రాయల్ మాత్రమే కాకుండా ఆన్ లైన్లోనూ ఉపయోగించడం వల్ల రివార్డులు అందిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రత్యేక సేవల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదు. కానీ మెయింటనెన్స్ ఛార్జీల కింద ప్రతీ ఏడాది కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. ఇక నుంచి డెబిట్ కార్డుల వార్షిక ఫీజును రూ.200 చెల్లించాలన్నమాట.