
పశ్చిమ బెంగాల్ లో రాజకీయ తుపానుకు తేరలేపిన నారదా కుంభకోణానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు సహా నేతల అరెస్టు వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సీబీఐ వాదనను తోసిపుచ్చుతూ నలుగురు నేతలకు కోల్ కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో వారికి బెయిల్ ఇచ్చింది. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో టీఎంసీ మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, తృణముల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మంత్రి సోవన్ ఛటర్జీని గతవారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.