Sheikh Hasina Verdict: మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కు బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించింది. అక్కడ జరిగిన అల్లర్లకు హసీనా ప్రధాన కారణమని భావిస్తూ కోర్టు ఈ శిక్ష విధించింది. అంతేకాదు భారతదేశంలో తలదాచుకున్న ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరింది. సోమవారం జరిగిన ఈ పరిణామాలు ఒక్కసారిగా చర్చకు దారి తీసాయి. వాస్తవానికి గత ఆగస్టు నుంచి హసీనా మన దేశంలో ఉంటున్నారు.. ఇంగ్లాండ్ దేశానికి శరణార్థిగా వెళ్లడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. దీంతో ఆమె భారత దేశంలోనే ఉండిపోవాల్సి వస్తోంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో విపరీతంగా అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. తాత్కాలిక యూనస్ ప్రభుత్వం మీద అక్కడి ప్రజలతో నమ్మకం పోయింది.. అక్కడి పోలీసులకు విస్తృతమైన అధికారాలు ఇవ్వడం ప్రజలకు నచ్చడం లేదు. దీనికి తోడు అవినీతి పెరిగిపోయింది.. అంతర్జాతీయ నోబెల్ బహుమతి సాధించిన యూనస్ పరిపాలన విషయంలో ఆ స్థాయిలో పట్టు సాధించలేకపోతున్నారు. దీంతో ప్రజలకు ఉన్న ఆశలు అడియాసలు అవుతున్నాయి. అక్కడి ప్రజలు వీధులలోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. పాలనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి యూనస్ ప్రభుత్వం చేయని పని అంటూ లేదు. అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన బంగ్లాదేశ్.. పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అమెరికాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఇది అక్కడి ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో హసీనా ప్రస్తావన మళ్ళీ అక్కడ వస్తోంది. ఆమె ఎక్కడ జనాల్లో సానుభూతి పెంచుకుంటారేమోనని.. ప్రజలకు ఆమె వైపు దృష్టి మరలుతుందోనని భావించి.. యునస్ ప్రభుత్వం హసీనాకు వ్యతిరేకంగా అభియోగాలను మోపిందని.. కోర్టులో ప్రభుత్వం తరఫున బలంగా వాదించిందని.. దీంతో కోర్టు కూడా ఆమెకు మరణశిక్ష విధించిందని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.
హసీనా మన దేశంలో ఉండడం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం నచ్చడం లేదు. పైగా ఇప్పుడు బంగ్లాదేశ్ అమెరికా కు అనుకూలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా భారత్ అమెరికాకు దూరంగా జరగడం మొదలుపెట్టింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అమెరికా మెప్పును మరింత పొందడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.. ఈ క్రమంలోనే హసీనా కు మరణశిక్ష విధించేలా అక్కడి ప్రభుత్వం పావులు కదిపినట్టు వార్తలు వస్తున్నాయి. హసీనాకు మరణశిక్ష విధించిన తర్వాత ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరింది. అయితే బంగ్లాదేశ్ విన్నపాన్ని భారత్ తిరస్కరించింది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం, శాంతి, సామరస్యం ఏర్పాటుకు తాము కృషి చేస్తామని.. హసీనాను అప్పగించే విషయంలో తాము తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు 1967లో హసీనాకు సరిగా నవంబర్ 17న వివాహం జరిగింది. అదేరోజు బంగ్లాదేశ్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించడం విశేషం. అయితే ఇందులో కుట్ర కోణం ఉందని.. కావాలని ఇలా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.