
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, టీ-20 ప్రపంచకప్ కు టీమిండియా మెంటార్ గా ఎంపికైన ధోనీకి మధ్య భేదాభిప్రాయాలు రావొద్దని ఆశిస్తున్నట్లు మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నాడు. 2004లో తాను భారత జట్టుకు మెంటార్ గా ఎంపికైనప్పుడు నాటి కోచ్ జాన్ రైట్ ఆయన స్థానాన్ని తాను భర్తీ చేస్తానేమో అన్న దిగులుతో ఉన్నాడని గవాస్కర్ చెప్పాడు. కోచ్, మెంటార్ మధ్య ఏకాభిప్రాయం ఉండడం ముఖ్యమని సన్నీ తెలిపాడు.