
మృతదేహాలపై కప్పిన బట్టలను శ్మశానవాటికలు దహనవాటికల నుంచి దొంగిలిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పాట్ లో ఈ ఘటన జరిగింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రజలు చనిపోతున్నట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న తరుణంలో ఇది వెలుగులోకి రావడం కలకలం రేపింది. చనిపోయిన వారి మృతదేహాలపై దుస్తులను శ్మశాన వాటికల నుంచి దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు భాగ్ పాట్ సర్కిల్ పోలీస్ అధికారి అలోక్ సింగ్ ఆదివారం తెలిపారు. 520 బెడ్ షీట్లు, 127 కుర్తాలు, 52 తెల్ల చీరలతోపాటు ఇతర దుస్తులు వస్తువులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.