నిరుద్యోగులకు శుభవార్త.. 572 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

కరోనా వైరస్ విజృంభణ వల్ల నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే మిలిట‌రీ ఇంజినీర్ సర్వీసెస నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 572 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. అర్హ‌త, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://mes.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి […]

Written By: Navya, Updated On : May 9, 2021 8:59 pm
Follow us on

కరోనా వైరస్ విజృంభణ వల్ల నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే మిలిట‌రీ ఇంజినీర్ సర్వీసెస నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 572 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. అర్హ‌త, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

https://mes.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా సులభంగా నివృత్తి చేసుకోవచ్చు. మొత్తం 572 ఉద్యోగ ఖాళీలలో సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీలు 458 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలలో పాటు 114 డ్రాఫ్ట్స్ మెన్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆర్కిటెక్చుర‌ల్ అసిస్టెన్స్‌షిప్‌లో డిప్లొమా చేసిన వాళ్లు డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టుల‌కు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎక‌నామిక్స్‌, కామ‌ర్స్‌, స్టాటిస్టిక్స్‌, బిజినెస్ స్ట‌డీస్‌, ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌లో పీజీ చేసిన వాళ్లు సూపర్ వైజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఈఎస్ఎం అభ్య‌ర్థుల‌కు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా 2021 సంవత్సరం మే 17 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.