
దేశంలోకి అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా పెరుగుతోంది. కొకైన్ హెరాయిన్ తదితర మత్తుపదార్థాలను పాక్ నుంచి పెద్ద ఎత్తున అక్రమార్కులు దేశంలోకి తరలిస్తున్నారు. తాజాగా సరిహద్దు భద్రతా దళం బుధవారం అర్ధరాత్రి 56 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో రూ. 275 కోట్ల విలువ ఉంటుందని బీఎస్ఎఫ్ తెలిపింది. పాక్ నుంచి స్మగ్లర్లు నిషేదిత మత్తు పదార్థాలను రాజస్థాన్ లో సరిహద్దు దాటించే ప్రయత్నం చేస్తుండగా బీఎస్ఎఫ్ గమనించి కాల్పులు జరిపింది. దీంతో అక్కడి నుంచి స్మగ్లర్లు పారిపోయారు.