దేశంలోని పాఠశాలలను దశలవారీగా తెరవాలని ఎయిమ్స్ సంచాలకుడు రణ్ దీప్ గులేరియా సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలను దశలవారీగా తెరిచే అంశాన్ని దేశం పరిశీలించాలని వ్యాఖ్యానించారు. కొవిడ్-19 నేపథ్యంలో గతేడాది మార్చిలో తొలి లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి దేశంలో పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తరగతులను ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు.