https://oktelugu.com/

ఆకట్టుకుంటున్న మామాకోడళ్ల ముచ్చట్లు ! 

సమంత మొత్తానికి బిజినెస్ లో ఎక్కడా తగ్గడం లేదు. నిజానికి సమంత ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు అర్భన్ ఫార్మింగ్ అంటూ ఇంటి డాబా మీదే కూరగాయలు కూడా పండిస్తోంది. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్‌ లోకి రంగ ప్రవేశం చేసి తన సొంత బ్రాండ్ కోసం నిర్విరామంగా పని చేసుకుంటూ.. తన బ్రాండ్ కోసం తన సన్నిహితులను కూడా వాడుకుంటూ  పక్కా బిజినెస్ విమెన్ లా ముందుకు పోతొంది. సాకీ […]

Written By:
  • admin
  • , Updated On : September 28, 2020 / 06:27 PM IST
    Follow us on

    సమంత మొత్తానికి బిజినెస్ లో ఎక్కడా తగ్గడం లేదు. నిజానికి సమంత ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు అర్భన్ ఫార్మింగ్ అంటూ ఇంటి డాబా మీదే కూరగాయలు కూడా పండిస్తోంది. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్‌ లోకి రంగ ప్రవేశం చేసి తన సొంత బ్రాండ్ కోసం నిర్విరామంగా పని చేసుకుంటూ.. తన బ్రాండ్ కోసం తన సన్నిహితులను కూడా వాడుకుంటూ  పక్కా బిజినెస్ విమెన్ లా ముందుకు పోతొంది. సాకీ వరల్డ్ పేరిట తన బ్రాండ్ డిజైనర్ దుస్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సామ్.. ఇప్పుడు ఈ బ్రాండ్ కోసం నాగ్ ను కూడా వాడుకుంది. నేడు సాకీ వరల్డ్ బ్రాండ్ దుస్తులను సమంత లాంచ్ చేసిన వెంటనే.. నాగ్ ట్వీట్ చేస్తూ.. ‘గుడ్ మార్నింగ్ డియర్ కోడలా.. కొత్త బ్రాండ్ దుస్తులను ప్రారంభిస్తున్నావ్ కంగ్రాట్స్.. అంతా మంచే జరగాలి.. నాకు తెలుసు నువ్ దూసుకుపోతావ్’ అంటూ.. పనిలో పనిగా సామ్ సాకీ బ్రాండ్  లాంచింగ్‌ ను ప్రమోట్ చేశాడు.
    Also Read : సావిత్రి, సౌందర్య, శ్రీదేవి మరణంలోని కీలకపాయింట్ ఇదే..
    అయితే నాగ్ చెప్పిన విషెస్ కి సామ్ స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ సో మచ్ మామా’ అంటూ వినయంగా ట్వీట్ చేసింది. ఈ మామ కోడళ్ల ముచ్చట్లు ఎప్పుడూ సరదాగా ఉంటాయని.. అసలు సమంత నాగార్జునను మామ అని పిలవడంలోనే గొప్ప సరదా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేసుకుంటూ సంతోషపడుతున్నారు.  మామ అంటూ సమంత పిలిచినా.. నాగ్ కూడా అంతే సరదాగా.. ‘ప్రియమైన కోడలా అంటూ సామ్ పై ప్రేమను కురిపిస్తాడని.. అది నాగ్ గొప్పతనం అని  నాగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి  వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు, మాట్లాడే మాటలు అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్లను కూడా తెగ ఆకట్టుకుంటున్నాయి అన్నమాట. మరి సమంత తన కొత్త బ్రాండ్ సాకీ  దుస్తులతో ఏ రేంజ్ బిజినెస్ చేస్తోందో చూడాలి.
    ఇంతకీ సమంత ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలకి రావడానికి పెద్ద కథే ఉందట. సామ్  ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో బాగా రాణించాలని చిన్నతనంలోనే ఎన్నో కలలు కన్నానని, ఒకప్పుడు మంచి దుస్తులు కూడా ధరించే స్థాయిలో లేని తాను,  ఇప్పుడు దేశంలోని అత్యధిక ఖరీదైన ఫ్యాషన్ డిజైనర్‌లు తయారు చేసిన దుస్తులను కూడా ధరిస్తున్నానని.. ఈ ఎదుగుదల నన్ను ఎంతో మార్చింది అని సమంత చెప్పుకొచ్చింది. అయితే  తక్కువ ధరలో అందరూ కొనేందుకు వీలుండేట్టుగా అద్భుతమైన డిజైన్లు అందించాలనే లక్ష్యంతోనే తానూ ఈ సాకీ వరల్డ్‌ ను ప్రారంభించానని సామ్ తెలిపింది.