చాలా విరామం తర్వాత పంజాబ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లోని పాఠశాలలు తెరుచుకున్నాయి. 50 శాతం విద్యార్థులనే అనుమతించి తరగతులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అధిక సంఖ్యలో తరగతులకు హాజరు కాగా, పట్టణాల్లో గరిష్టంగా 30 శాతం మాత్రమే హాజరయ్యారు. మళ్లీ బడులు తెరచుకోవడం పై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కరోనా మూడో వేవ్ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో బడులు తెరవడం పై చాలామంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.