
టేబుల్ టెన్నిస్ పురుషుల రెండో రౌండ్ లో ఆచంట శరత్ కమల్ విజయం సాధించాడు. పోర్చుగల్ ప్లేయర్ అపోలోనియా టియాగోపై 4-2 తేడాతో చారిత్రక విజయం సాధించాడు. 49 నిమిషాల్లోనే వరల్డ్ 59వ ర్యాంక్ ఆటగాడిని 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9 స్కోర్ తో మట్టికరిపించి మూడో రౌండ్ లోకి ప్రవేశించాడు. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో మనికా బాత్రా మూడో రౌండ్ లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.