
శ్రీలంకతో రెండో వన్డేకు యువ ఆటగాడు సంజు శాంసన్ అందుబాటులో ఉంటాడని తెలిసింది. మోకాలి గాయం నుంచి అతడు కోలుకున్నాడని సమాచారం. ఇషాన్ కిషన్ అదరగొట్టిన వేళ అతడిని జట్టులోకి తీసుకుంటారా? మరికొంత విశ్రాంతినిస్తారా? చూడాల్సి ఉంది. సంజు శాంసన్ రెండో వన్డేకు అందుబాటులో ఉంటున్నాడని తెలియడంతో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆనందం వ్యక్తం చేశారు. తిరువనంతపురం కుర్రాడు రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడు. ఆల్ ది బెస్ట్ సంజు అని ట్విట్ చేశారు. వీరిద్దరూ ఒకే నగరానికి చెందిన వారు కావడం గమనార్హం.