Samba Siva Rao : రాజకీయ పార్టీ నాయకులకు ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద కోపం ఉంటుంది. రాజకీయాలలో అవన్నీ సర్వసాధారణం. కానీ ఒక రాజకీయ పార్టీ మీద పాత్రికేయుడికి కోపం ఉండొచ్చా? ఆ కోపం వ్యక్తిగత విషయాలను ప్రస్తావించవచ్చా? ఈ ప్రశ్నలకు జర్నలిస్టులు అయితే ఉండకూడదు అని సమాధానం చెబుతారు. కానీ, ఓ పార్టీకి భజన చేసే ఎర్నలిస్టులు మాత్రం ఇందుకు భిన్నంగా సమాధానం చెబుతారు. వాస్తవానికి ఒక పార్టీకి భజన చేయడం అనేది పాత్రికేయం కాదు. కానీ, నేటి కాలంలో పాత్రికేయం విలువలతో సాగడం లేదు. రాజకీయ పార్టీలకు డబ్బా కొట్టడంతో సరి పోతోంది.
తెలుగులో ఎన్నో మీడియా సంస్థలు ఉన్నాయి.. అందులో టీవీ5 కూడా ఒకటి. ఈ ఛానల్ లో సాంబశివరావు అనే సుప్రసిద్ధ జర్నలిస్ట్ పని చేస్తుంటారు. ముఖ్యంగా ప్రైమ్ టైంలో డిబేట్లను నిర్వహిస్తుంటారు. ఏదైనా విషయం మీద ఆయన ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఆయన.. వైసీపీకి సంబంధించిన విషయాలలో మాత్రం ఫైర్ విల్ ఫైర్ ఐ యాం ఫైర్ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు.
వైసీపీ విషయంలోనే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ నేతల మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అనగానే చాలామందికి తెలంగాణ గుర్తుకు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు లతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ, సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద. రాజీవ్ గాంధీ నుంచి మొదలు పెడితే ప్రియాంక గాంధీ వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా సాంబశివరావు విమర్శలు చేశారు. వారు చేసుకున్న వివాహాలను పదేపదే ప్రస్తావించారు. అందులో మతం కోణాన్ని ఆయన బయటపెట్టారు.
ఈ వీడియోను వైసిపి అనుకూల సోషల్ మీడియా విపరీతంగా సర్కులేట్ చేస్తోంది. ఈ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మీద విమర్శలు చేసిన సాంబశివరావు మీద తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదా? కాంగ్రెస్ నేతలు ఏమీ చేయలేరా? అంటూ వైసిపి నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనిపై ఇంతవరకు కాంగ్రెస్ నేతలు స్పందించారా? లేదా? అనేది తెలియ రాలేదు.
కాంగ్రెస్ అధినాయకత్వం గాంధీ కుటుంబం మీద టీవీ5 యాంకర్ తీవ్రమైన వ్యక్తిగత అనుచిత వ్యాఖలు !!
తులసిరెడ్డి మాజీ టీడీపీ కనుక ఖండించలేరు !!
కనీసం… అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దిన్ని ఖండిస్తుందా??? pic.twitter.com/cZ9XKWh4VI— The Samosa Times (@Samotimes2026) December 28, 2025