
టీఆర్ ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అవరోధాలు కొందరికి అడ్డంకిగా మారితే మరికొందరిని గొప్ప వ్యక్తులుగా తయారు చేస్తాయన్న నెల్సన్ మండేలా సూక్తిని ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని త్యాగం చేసే స్థాయికి వెళ్లిన నిజమైన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.