
దేవస్థానాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారుచేసిన అగరబత్తులను భక్తుల కోసం టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏడుకొండల స్ఫూర్తితో తీసుకువచ్చిన ఏడు బ్రాండ్ల అగరబత్తుల విక్రయాన్ని తిరుపతిలోని ఎస్వీ గోశాలలో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో కూడా వీటిన విక్రయిస్తారు. ఈ అగరబత్తుల తయారీకి దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ, వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది.