Ustaad Bhagath Singh : ‘ఓజీ'(They Call Him OG) లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి రాబోయే చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagath Singh). ఈ చిత్రానికి ఎప్పుడో 2019 వ సంవత్సరం లో ముహూర్తం పడింది. ఆ తర్వాత ఈ చిత్రం కార్యరూపం దాల్చడానికి 2024 వ సంవత్సరం వరకు ఆగాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని గత ఏడాది పవన్ కళ్యాణ్ పూర్తి చేసాడు. కేవలం ఆయన లేని సన్నివేశాలను మాత్రమే ఇన్ని రోజులు హరీష్ శంకర్ షెడ్యూల్స్ వారీగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన ‘దేఖ్లంగే సాలా’ పాటకు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గానే ఈ పాట యూట్యూబ్ లో 40 మిలియన్ వ్యూస్ మార్కు ని సొంతం చేసుకుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. కానీ ‘ఏజెంట్’ మూవీ హీరోయిన్ సాక్షి వైద్య(Sakshi Vaidya) రీసెంట్ గా ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ ప్రొమోషన్స్ సమయం లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో రాశీ ఖన్నా క్యారక్టర్ కోసం ముందుగా నన్నే ఎంచుకున్నారు. ఒక వారం రోజుల పాటు నాపై కొన్ని కీలక సఞ్ఞవేశాలను కూడా చిత్రీకరించారు. కానీ ఆ తర్వాత షూటింగ్ కి బ్రేక్ పడింది. నేను వేరే సినిమాలతో బిజీ అయిపోయాను. దాంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాను. అలా ఆ సినిమా మిస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలి అనేది నా డ్రీం, ఈ సినిమా మిస్ అయ్యినందుకు నేను ఎంత బాధ పడ్డానో నాకు మాత్రమే తెలుసు’ అంటూ చెప్పుకొచ్చింది సాక్షి వైద్య.
శర్వానంద్ హీరో గా నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం లో సంయుక్త మీనన్ ఒక హీరోయిన్ కాగా , సాక్షి వైద్య మరో హీరోయిన్. సాక్షి వైద్య మొదటి చిత్రం ఏజెంట్ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ హీరోయిన్ కెరీర్ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు . కానీ ఆమెకు అవకాశాలు గట్టిగానే వచ్చాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేసి ఉండుంటే ఆమె రేంజ్ ఇప్పుడు మరోలా ఉండేది. ఇకపోతే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. మార్చ్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరున విడుదల తేదీ ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి.