Iran protests : ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశంలో వారం రోజులుగా ప్రజలు రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు. రోజురోజుకూ ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ధరల పెరుగుదల, డాలర్‌తో పోలిస్తే రియాల్ విలువ పడిపోవడం ప్రజాగ్రహానికి కారణమవుతోంది. ఇజ్రాయెల్ పత్రిక ‘ది జెరూసలెం పోస్ట్’ ప్రకారం, అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు ఈ పరిస్థితిలో జోక్యం చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. వెనెజువెలాలో మదురోపై అమెరికా చర్యలు ఇక్కడి నిరసనకారుల్లో ఆశను నింపాయి.
నెతన్యాహు వార్నింగ్..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల తయారీ పునఃప్రారంభించకూడదని హెచ్చరించారు. పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌పై దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజల ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఇవి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌ను హెచ్చరించారు. నిరసనలను అణచివేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, దాడి తప్పదని స్పష్టం చేశారు.
హింసాత్మక పరిణామాలు
ఇదిలా ఉంటే ఇరాన్‌లో నిరసనలను అక్కడి ప్రభుత్వం బలవంతంగా అణచివేస్తోంది. ఇప్పటికే 35 మంది ఆందోళనకారులు మరణించారు. వారం దాటిన ఈ నిరసనల్లో 1,200 మంది అరెస్టులు జరిగాయి. 250 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అంతర్జాతీయ దృష్టి ఇరాన్‌పై పడింది. మరోవైపు నిరసనలు దేశంలో 78 నగరాలకు విస్తరించాయి. విదేశీ జోక్యం తప్పదన్న ప్రచారం జరుగుతోంది.
అడ్రస్ లేకుండా పోయిన ఖమేనీ..
దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుంటే.. సుప్రీం లీడర్ హయతులా‍్ల అలీ ఖమేనీ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో కూడా ఆయన స్పందించడం లేదు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇరాన్ ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిని ఖండిస్తున్నాయి. మరోవైపు నిరసనల అణచివేతలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వెనుజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్టు చేసిన నేపథ్యంలో ప్లాన్ బీ అమలుకు ఖమేనీ రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఖమేనీ 20 మందితో కలిసి రష్యాకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.