Avatar 3 overseas impact : గత ఏడాది డిసెంబర్ 19 న భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘అవతార్ 3′(Avatar 3 : The Fire & Ash) చిత్రం, ప్రేక్షకులను అంతంత మాత్రంగానే ఆకట్టుకుంది. రీసెంట్ గానే 1 బిలియన్ డాలర్ మార్కుని అందుకున్న ఈ సినిమా, ఫుల్ రన్ 1.5 బిలియన్ డాలర్ మార్కుని కూడా అందుకోవడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ హాలీవుడ్ లో ఇంగ్లీష్ సినిమాలకు లాంగ్ రన్ ఎక్కువ ఉంటుంది. పైగా అవతార్ ఫ్రాంచైజ్ సినిమాలు సంవత్సరానికి పైగా థియేటర్స్ లో రన్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది సినిమా విడుదలై కనీసం 20 రోజులు కూడా కాకముందే ఎలా తీస్తారు చెప్పండి?. ఇప్పుడు సంక్రాంతికి విడుదల అవ్వబొయె మన సౌత్ సినిమాలు, ‘అవతార్ 3’ కారణంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకుంటున్నాయి. ఎందుకంటే కావాల్సినన్ని షోస్ దొరకడం లేదు. స్టాండర్డ్ ఫార్మటు స్క్రీన్స్ మాత్రమే దొరుకుతున్నాయి.
ఇది సినిమాకు చాలా గట్టి దెబ్బ అనే చెప్పాలి. ఉదాహరణకు ‘రాజాసాబ్’ చిత్రాన్ని తీసుకుందాం. ఇప్పటి వరకు ఈ సినిమాకు 1200 షోస్ మాత్రమే షెడ్యూల్ చేశారు. అందులో
XD షోస్ కేవలం 43 మాత్రమే. ఒక సినిమాకు అత్యధిక వసూళ్లు రావాలంటే కచ్చితంగా XD షోస్ ఉండాలి. అక్కడి ఆడియన్స్ ఈ ఫార్మటు స్క్రీన్ లోనే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతారు. ఈ 43 షోస్ కూడా టాప్ డిస్ట్రిబ్యూటర్ ‘రాజా సాబ్’ కి దొరకడం వల్లే వచ్చింది. ఇక ప్రస్తుతం USA బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ ఆక్యుపెన్సీ తో బుకింగ్స్ ని నమోదు చేసుకుంటున్న తమిళ హీరో విజయ్ ‘జన నాయగన్’ చిత్రానికి అయితే ఇప్పటి వరకు 646 షోస్ ని మాత్రమే షెడ్యూల్ చేశారు. అందులో XD షోస్ కేవలం 6 మాత్రమే దొరికాయి. ఇక మెగాస్థార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం పరిస్థితి అయితే మరీ దారుణం.
ఇప్పటి వరకు USA లో ఈ చిత్రానికి 520 షోస్ ని షెడ్యూల్ చేశారు. అందులో 501 స్టాండర్డ్ ఫార్మటు షోస్ కాగా, 19 PLF షోస్ ఉన్నాయి. XD షోస్ అయితే గుండు సున్నా. రాబోయే రోజుల్లో కనీసం ఒక్క షో అయినా దొరుకుతుందా అంటే అనుమానమే. కానీ ఈ చిత్రానికి కూడా టికెట్స్ డిమాండ్ పీక్ రేంజ్ లో ఉంది. దాదాపుగా 16 శాతం కి పైగా ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది. ఇంత పెద్ద సినిమాల పరిస్థితే ఇలా ఉంది. ఇక తమిళం నుండి ‘పరాశక్తి’ అనే సినిమా , తెలుగు నుండి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటికి కనీసం వంద షోస్ దొరకడం కూడా కష్టమే. ‘అవతార్ 3’ ప్రభావం ఏ రేంజ్ లో ఉందో మీరే చూడండి.