
కేరళ కుట్టి సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ తో ఫల్ బిజీగా ఉంది. సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, విరాట పర్వం చిత్రాలు ఇప్పటికే విడుదల కావలసి ఉన్న కరోనా వల్ల వాయిదా పడ్డాయి. ప్రస్తుతం టాక్సీవాల డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రం చేస్తుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తుంగా, నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని, సాయి పల్లవి మేకొవర్ కొత్తగా ఉంటుంది.