
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలైన నటుడు సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని అపోలో వైద్యులు చెప్పారు. కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయిందని ప్రకటించారు. మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. ఆయన ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.