
సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో జేఎండీ సంగీతారెడ్డి తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సాయి తేజ్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని అపోలో జేఎండీ సంగీతారెడ్డి పేర్కొన్నారు. గత రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సాయిధరమ్ తేజ్ కి ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.