Ruturaj Gaikwad poor form గత ఏడాది ఐపీఎల్ జరుగుతున్నప్పుడు చెన్నై జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంది. దీంతో జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. గాయం అయిందని చెప్పి రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది. ధోనిని తాత్కాలిక సారధిగా నియమించింది. అయితే చెన్నై జట్టు ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. కాకపోతే ధోని సారధిగా ఉండడంతో అభిమానులు కాస్తలో కాస్త మేనేజ్మెంట్ మీద సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించారు.
ఇక ప్రస్తుత ఐపీఎల్ లో చెన్నై జట్టు సారధిగా అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. బ్యాటింగ్ లో సత్తా చూపించలేకపోతున్నాడు. బౌలింగ్ కూర్పు విషయంలో కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఫీల్డింగ్ ఏర్పాటులో కూడా అతడు అంత చాకచక్యంగా ఉండడం లేదు. అందువల్ల చైనా జట్టు రాజస్థాన్ చేతిలో.. పంజాబ్ చేతిలో ఓటములు ఎదుర్కొంది.
ముఖ్యంగా పంజాబ్ చేతిలో చెన్నై ఓడిపోవడానికి ప్రధాన కారణం గైక్వాడ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయుష్ మాత్రే కు స్ట్రైకింగ్ ఇచ్చి.. గైక్వాడ్ కేవలం సింగిల్ టేకర్ గానే మిగిలిపోయాడు. ఒకవేళ అతడు విజృంభించి ఆడి ఉంటే చెన్నై పరిస్థితి మరో విధంగా ఉండేది.
ఇక ఆదివారం నాటి బెంగళూరు మ్యాచ్లో గైక్వాడ్ మరోసారి తన నిర్లక్ష్యాన్ని చాటుకున్నాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. మూడు బంతుల్లో ఒక సిక్సర్ సహాయంతో ఏడు పరుగులు చేసిన అతడు.. డఫీ బౌలింగ్లో దేవదత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. గైక్వాడ్ అలా అవుట్ కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి.
“చెన్నై జట్టు పరువును నువ్వు కాపాడలేవు. ధోని వారసుడిగా నువ్వు ఆకట్టుకోలేవు. ఇన్ని వైఫల్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ నీకు కనువిప్పు కలగడం లేదా. ఇలా ఆడితే చెన్నై జట్టు విజేత అవుతుందా.. ఎందుకైనా మంచిది గత సీజన్ మాదిరిగానే గాయం అయిందని చెప్పు. రిజర్వ్ బెంచ్ కు పరిమితమైపో” అని చెన్నై అభిమానులు ఆవేదనతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..
ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడాడు గైక్వాడ్.. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 28 పరుగులు చేశాడు. తెగ తాజాగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏడు పరుగులు చేశాడు.. గైక్వాడ్ ఇలా ఆడటాన్ని క్రికెట్ విశ్లేషకులు కూడా ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకైనా మంచిది. చెన్నై మేనేజ్మెంట్ కెప్టెన్ విషయంలో ఒకసారి ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.