Ruturaj Gaikwad : చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అద్భుతమైన చరిత్ర ఉంది. అభిమానులపరంగా.. సాధించిన ట్రోఫీల పరంగా చెన్నై జట్టు ఐపీఎల్లో తిరుగులేని స్థానంలో కొనసాగుతోంది. కొంతకాలంగా సరిగ్గా ఆడలేకపోతున్నప్పటికీ.. చెన్నై జట్టు విలువ ఏమాత్రం తగ్గలేదు. చెన్నై జట్టుకు ఈ స్థాయిలో క్రెడిబిలిటీని తీసుకొచ్చింది ముమ్మాటికి మహేంద్ర సింగ్ ధోని. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ముంబై ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న క్రమంలో.. చెన్నై జట్టుకు తిరుగులేని స్టామినాను అందించాడు ధోని.
వయోభారం.. ఇతర సమస్యల వల్ల ధోని రెండు సంవత్సరాల క్రితం సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆటగాడిగా మాత్రం కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గైక్వాడ్ కు చెన్నై మేనేజ్మెంట్ సారద్య బాధ్యతలు అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. సారధిగా అతడు విఫలమవుతున్నాడు. ధోని లెగసీని కంటిన్యూ చేయాల్సిన అతడు అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు. గత సీజన్లో సరిగా ఆడ లేకపోయినా అతడు.. గాయం వల్ల మధ్యలోనే టోర్నీ నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు సారధిగా విఫలమవుతున్నాడు. ఆటగాడిగా కూడా చేతులెత్తేస్తున్నాడు. ఓపెనర్ గా వస్తున్న గైక్వాడ్.. ఆస్థానానికి సార్థకం కలిగించే విధంగా ఇన్నింగ్స్ ఆడలేక పోతున్నాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరుగుతున్న ప్రస్తుత మ్యాచ్లో గైక్వాడ్ మరోసారి ఫ్లాఫ్ అయ్యాడు. కేవలం ఏడు పరుగులకే అవుట్ అయ్యాడు. ఇప్పటివరకు అయితే ఇన్నింగ్స్ లలో వరుసగా 6(11), 28(22), 7(3), 15(18),7(6) పరుగులు చేశాడు. 105 స్ట్రైక్ రేట్ తో కేవలం 63 పరుగులు చేశాడు. దీంతో అతడి ఆట తీరు పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గైక్వాడ్ విశ్రాంతి తీసుకుని.. వేరే ఆటగాడికి అవకాశం ఇవ్వాలని క్రికెట్ విశ్లేషకులు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ కు సూచిస్తున్నారు.. ఇలా ఆడితే చెన్నై జట్టు ట్రోఫీ కాదు కదా.. కనీసం ప్లే ఆఫ్ దాకా కూడా వెళ్లలేదని చెబుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ గైక్వాడ్ మీద విపరీతమైన ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో అయినా గొప్పగా ఆడతాడని భావించింది. కానీ అతడు మరోసారి విఫల ప్రదర్శన చేస్తున్నాడు. ఇలానే ఆడుతుంటే.. వచ్చే రోజుల్లో అతని పరిస్థితి రిజర్వ్ బెంచ్ లేదా.. జట్టు నుంచి వెళ్లిపోవడమో.. వంటివి చోటు చేసుకుంటాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి గైక్వాడ్ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఏమాత్రం సమర్థవంతంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. కనీసం బంతులను డిపెండ్ కూడా చేసుకోలేకపోతున్నాడు. ఇతర ప్లేయర్లు దుమ్మురేపుతుంటే.. అతడు మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమవుతున్నాడు.
