
సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కరోనా వ్యాక్సిన్ కు రష్యా అమోదం తెలిపింది. రెండు డోసుల స్పుత్నిక్ వీ టీకా సామర్థ్యం 91.6 శాతం కాగా, సింగిల్ డోస్ టీకా సామర్థ్యం 79.4 శాతమని వ్యాక్సిన్ కోసం నిధులు సహాయం చేస్తున్న రష్యా డైరెక్టర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యాలో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 15 వరకు నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ అనంతరం 28 రోజుల తర్వాత సేకరించిన డేటా ఆధారంగా సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ సామర్థ్యాన్ని అంచనా వేసినట్లు వెల్లడించింది.