ఈటల రాజేందర్ తో కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటి అయ్యారు. మేడ్చల్ లోని ఈటల నివాసంలో వీరిద్దరూ కలిశారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య సుధీర్ఘంగా చర్చ జరుగుతోంది. కొండా, ఈటల కలిసి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై చర్చించేందుకే ఈటల రాజేందర్ ఇంటికి కొండా వెళ్లారని సమాచారం. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరి 2018 ఎన్నికల్లో చేవెల్ల నుంచి […]
Written By:
, Updated On : May 6, 2021 / 08:14 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటి అయ్యారు. మేడ్చల్ లోని ఈటల నివాసంలో వీరిద్దరూ కలిశారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య సుధీర్ఘంగా చర్చ జరుగుతోంది. కొండా, ఈటల కలిసి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై చర్చించేందుకే ఈటల రాజేందర్ ఇంటికి కొండా వెళ్లారని సమాచారం. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరి 2018 ఎన్నికల్లో చేవెల్ల నుంచి ఎంపీగా పోటి చేసి ఓడిపోయారు. ఆనంతరం జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు.