
పాలకులు మారినా పేదోడి బతుకు మారలేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీ ప్రభుత్వం వంతాడలో లేటరైట్ ఖనిజం తవ్వకం పేరుతో విలువైన బాక్సైట్ ఖనిజాన్ని లక్షల టన్నులు తరలిస్తున్నదని తెలిపారు. 2018 పవన్ కల్యాణ్ వంతాడలో ఆండ్రూ కంపెనీ తవ్వాలు జరిపే చోటు వెళ్లి అక్కడి దోపిడీని అందిరికీ చూపిండని తెలిపారు. వంతాడతో పాటు భమిడికలొద్ది మైనింగ్ పై తక్షణమే విచారణ చేపట్టి అక్కడ ఉన్నది లేటరైటా, బాక్సైటా అని తేల్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.