కోవిడ్ మహమ్మారి బాధితుల్లో సకారాత్మక దృక్పథాన్ని పెంచేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ చేపట్టిన కార్యక్రమంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడమంటే తమ ఆత్మీయులను కోల్పోయినవారిని పరిహసించడమేనని దుయ్యబట్టారు. పాజిటివ్ థింకింగ్ అంటూ ఉపన్యాసాలు ఇస్తూ బాధిత కుటుంబాలపై జోకులేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందుల కొరత తీవ్రంగా ఉందని గుర్తు చేశారు.