ఈటల రాజీకొచ్చారా..? రివర్స్ వెళ్లనున్నారా..? 

టీఆర్ఎస్ పార్టీ నుంచి బర్తరఫ్ కాబడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు పలువురు ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈటల సైతం కాంగ్రెస్ నాయకులతో కేసీఆర్ వ్యతిరేక శక్తులనంతా కూడగడుతున్నారు. ఈ తరుణంలో ఈటలపై చర్యలు తీసుకోవడంలో పార్టీ అధిష్టానం తప్పటడుగు వేసిందా..? అని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ కథనం రాసి అలజడి సృష్టించింది. ఆ కథనంతో రాజకీయాల్లో మరో మార్పు జరగనుందా..? అనే చర్చ […]

Written By: NARESH, Updated On : May 12, 2021 5:58 pm
Follow us on

టీఆర్ఎస్ పార్టీ నుంచి బర్తరఫ్ కాబడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు పలువురు ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈటల సైతం కాంగ్రెస్ నాయకులతో కేసీఆర్ వ్యతిరేక శక్తులనంతా కూడగడుతున్నారు. ఈ తరుణంలో ఈటలపై చర్యలు తీసుకోవడంలో పార్టీ అధిష్టానం తప్పటడుగు వేసిందా..? అని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ కథనం రాసి అలజడి సృష్టించింది. ఆ కథనంతో రాజకీయాల్లో మరో మార్పు జరగనుందా..? అనే చర్చ మొదలైంది.

కోళ్ల ఫాం భూములు, దేవర యాంజల్ భూముల విషయంలో ఈటలపై చర్యలు తీసుకునేందుకు మొన్నటి వరకు ప్రభుత్వం ఆగమేఘాల మీద అధికారులను పంపి నివేదికలను తెప్పించుకుంది. మాజీ మంత్రి ఈటల భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో దేవరయాంజల్ భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీనే వేసింది. ఈ భూముల వ్యవహారంపై ఆ కమిటి నిగ్గు తేల్చనుంది.

ఈ తరుణంలో ఈటలపై విచారణ విషయంలో కాస్త స్లో అయింది. కమిటీ కూడా స్పీడును తగ్గించింది. దీంతో ఈటల రాజీకొచ్చారని ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురించింది. తాను చేసిన పనికి లొంగిపోతానని ఈటల కేసీఆర్ కు మెసెజ్ పంపారని అందులో పేర్కొన్నారు. అయితే పార్టీలో ఉంటూ ఈటల ఇదివరకే బీసీ సంఘాలన్నీ ఏకం చేస్తున్నాడని ఆయనను భూముల వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ నుంచి వెళ్లేటట్లు చేశారన్న ప్రచారం జరిగింది.

అయితే ఈ సమయంలో ఈటల మళ్లీ రాజీకొచ్చారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకవేళ ఈటల రాజీకొచ్చినా కేసీఆర్ క్షమించే అవకాశం లేదని కొందరు పార్టీ నాయకులు అంటున్నా.. మరి కొందరు మాత్రం ఈటల ఇతరుల మద్దతు కూడగట్టుకొని బలమైన నాయకుడిగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇదంతా కొందరు కావాలనే ప్రచారం చేయిస్తున్నారని, ఆయనతో వచ్చేవారిని తికమక పెట్టేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఈటల సన్నిహితులు అంటున్నారు. అయితే చివరికి ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..