Nellore Lady Nayim: తెలంగాణలో అప్పట్లో నయీం సృష్టించిన రౌడీయిజం గుర్తుకుందా.. అతడు చనిపోయిన తర్వాత మీడియాలో.. అతడి గురించి కథలు కథలుగా కథనాలు ప్రసారమయ్యాయి. భువనగిరి మాత్రమే కాదు.. తెలంగాణ మొత్తం అతడు దందాలకు పాల్పడినట్టు ఆ తర్వాత మీడియాలో వార్తలు వచ్చాయి. నయీం ను అంతం చేయడానికి ఏకంగా కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయంటే.. అతడి నేర సామ్రాజ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నెల్లూరులో కూడా ఓ మహిళ నయీం లాగానే నేరా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏకంగా పోలీస్ వ్యవస్థను.. రాజకీయ వ్యవస్థను తన చేతిలో పెట్టుకొని రెచ్చిపోతున్నది.
Also Read: ఏఎస్పీ తో ఐ లవ్యూ.. ఆస్పత్రిలో ఖైదీతో హాట్ రొమాన్స్.. సంచలనం సృష్టిస్తున్న కిలేడి వీడియోలు!
ఆదివారం సోషల్ మీడియాలో కరుడుగట్టిన నేరస్థుడితో ఆ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో చక్కర్లు కొట్టింది. అంతకుముందు ఏ ఎస్పీతో ఐ లవ్ యు అని ఆమె చెప్పించుకున్న ఆడియో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. వాస్తవానికి ఆ కరుడుగట్టిన నేరస్తుడు నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విడుదల కావడానికి ప్రధాన కారణం సదరు మహిళ అని తెలుస్తోంది. ఎక్కడో నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన ఆమె ఇక్కడిదాకా ఎదగడానికి అన్ని రకాల అడ్డదారులు తొక్కింది. చివరికి తన ప్రవృత్తికి.. తన అడ్డదిడ్డమైన ఎదుగుదలకు భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని కూడా రోడ్డు ప్రమాదంలో చంపించేసింది. అక్కడి నుంచి మొదలైన ఆమె నేర ప్రస్థానం దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ వస్తోంది. వేగంగా రాజకీయాలను, పోలీసులను శాసించే స్థాయికి ఆమె ఎదిగింది.
ముగ్గురు ఎస్పీలు వద్దని చెప్పినప్పటికీ.. ఏకంగా ఆమె ఒక నేరస్తుడికి బెయిల్ ఇప్పించుకుంది. పోలీసులు మాత్రమే కాదు.. ఏకంగా సెక్రటేరియట్ లో పనిచేసే మంత్రులు, ఉన్నతాధికారులతో ఆమె పని చేయించుకోవడం మొదలు పెట్టింది. గతంలో ఆమె ఒక పార్టీకి అనుకూలంగా ఉండగా.. ఇప్పుడు అధికారంలో ఉన్న మరో పార్టీ నాయకులతో ఆమె అంట కాగడం సంచలనం సృష్టిస్తోంది. కేవలం దందాలు మాత్రమే కాకుండా దౌర్జన్యాలు, నేరమయ కార్యకలాపాలకు ఆమె పాల్పడుతోందని ఆరోపణ వినిపిస్తున్నాయి. జైల్లో ఉన్న వ్యక్తి పేరుతో ఆమె నేరాలు చేస్తున్నారని.. ఒక ముఠాను కూడా ఆమె నిర్వహిస్తున్నారని సమాచారం. మాదకద్రవ్యాల వ్యాపారం లోకి కూడా ఆమె అడుగు పెట్టారని.. అడ్డగోలుగా సంపాదిస్తూ సమాంతర వ్యవస్థను నడిపిస్తున్నారని సమాచారం. అయితే ఇంత జరిగిన తర్వాత.. మీడియా ద్వారా ఇంత వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఆమెపై కూటమి ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.