గత కొన్నేళ్లుగా దేశంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. 2025 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు పెరగనున్నట్లు తాజా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత వినియోగంతో పోలిస్తే దాదాపు 45 శాతం పెరుగుదల నమోదు చేసుకోనున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్ వినియోగంలో మహారాష్ట్ర ముందుండగా అక్కడి జనాభాలో 61 శాతం ఇంటర్నెట్ వాడుతున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కంటార్ […]
గత కొన్నేళ్లుగా దేశంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. 2025 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు పెరగనున్నట్లు తాజా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత వినియోగంతో పోలిస్తే దాదాపు 45 శాతం పెరుగుదల నమోదు చేసుకోనున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్ వినియోగంలో మహారాష్ట్ర ముందుండగా అక్కడి జనాభాలో 61 శాతం ఇంటర్నెట్ వాడుతున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కంటార్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.