
ప్రజలపై గ్యాస్ బండ భారం నెలనెలా పెరుగుతూనే ఉంది. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర మరో రూ. 25 పెరిగింది. మంగళవారం సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 25 పెంచిన అయిల్ కంపెనీలు, తాజాగా సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధరను కూడా రూ. 25 పెంచాయి. అయిల్ కంపెనీలు వెల్లడించిన ధరల ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 859కి చేరింది. తాజా పెంపుతో వంట గ్యాస్ ధరలను వరుసగా రెండు నెలలు పెంచినట్లయ్యింది. జూలై 1న కూడా సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 25.50 పెరిగింది.