India vs South Africa Final Rohit sharma : ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ సెంచరీ చేసి అదరగొట్టాడు. చాలాకాలం తర్వాత అతడు తన పూర్వపు ఫామ్ అందుకున్నాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ.. మూడో వన్డేలో సెంచరీ చేసి దుమ్మురేపాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నాడు. అంతేకాదు తను వన్డేలలో కొనసాగుతానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అతని అభిమానుల ఆనందానికి అడ్డు లేకుండా పోయింది.
ఇటీవల కాలంలో రోహిత్ బ్యాటింగ్ మీద మరింత ఫోకస్ పెట్టాడు. అభిషేక్ నాయర్ ను శిక్షకుడిగా పెట్టుకున్నాడు. బరువు కూడా తగ్గాడు. అతడిచ్చిన సలహాలతో తన బ్యాటింగ్లో ఉన్న లోపాలను సవరించుకున్నాడు. అందువల్లే ఇటీవలే ఆస్ట్రేలియా సిరీస్ లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేయగలిగాడు. ముఖ్యంగా మూడో వన్డేలో తన చిరకాల మిత్రుడు విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. తద్వారా తను వన్డేలలో టీమిండియా కు ఎంత స్పెషలో నిరూపించాడు.
వన్డే సిరీస్ తర్వాత స్వదేశానికి వచ్చిన రోహిత్ శర్మ కుటుంబంతో గడుపుతున్నాడు. బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముంబైలో జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ భారత మహిళల జట్టును కలిశాడు. హర్మన్ ప్రీత్ కౌర్ కు అనేక సలహాలు ఇచ్చాడు. ఆమెతో కలిసి చాలాసేపు మాట్లాడినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఫైనల్ మ్యాచ్ సందర్భంగా.. మన అమ్మాయిల ఆట చూసేందుకు రోహిత్ కుటుంబంతో సహా వచ్చాడు. మన అమ్మాయిల ఆట చూసి మురిసిపోయాడు. ముఖ్యంగా వర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ ఆనందం వ్యక్తం చేశాడు. కొన్ని సందర్భాలలో మన అమ్మాయిలు అవుట్ అయినప్పుడు రోహిత్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినా భారీ స్కోర్ చేయడంతో రోహిత్ సంతృప్తి వ్యక్తం చేశాడు. రోహిత్ మ్యాచ్ చూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.