
రెండో ఇన్నింగ్న్ లో టీమ్ ఇండియా ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరు ఓవర్లకు 15 పరుగులు చేశారు. మార్క్ వుడ్ వేసిన ఆరో ఓవర్ లో రోహిత్ (12) ఒక బౌండరీ బాదాడు. మరో వైపు రాహుల్ (2) పరుగులతో కొనసాగుతున్నాడు. భారత్ ఇంకా 12 పరుగుల లోటుతో బ్యాంటింగ్ చేస్తోంది.