
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం చోటు చేసుకున్న ప్రమాదాలతో దహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. హైదరాబాద్ నగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కిందపడ్డారు. ఈ సమయంలో అటుగా వచ్చిన రెడీమిక్స్ వాహనం వీరిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను మహారాష్ట్రలకు చెందిన కమ్రుద్దీన్, బబ్లూ, జమీల్ గా గుర్తించారు. వీరు లంగర్ హౌస్ లో ఉంటూ కూరగాయల వ్యాపారం చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు. తిరుపతి అలిపిరిరోడ్డులో ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరు యువకులు మృతిచెందారు.