
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఎవరి అంచనాల్లో వారు తలమునకలవుతున్నారు. ఆశావహుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. కేబినెట్ లో ఎవరుంటారో? ఎవరు వెళతారో తెలయడం లేదు. దీంో రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఏ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తారో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. జిల్లాల వారీగా సామాజిక వర్గీకరణ దృష్ట్యా ఎవరికి బెర్త్ లు ఖాయమవుతాయోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తానికి మంత్రివర్గ విస్తరణ జగన్ కు ఓ పెద్ద సవాల్ గానే భావిస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం ఉన్నా సామాజిక వర్గాలకే మొగ్గు చూపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన గుమ్మనూరు జయరాంకు పదవి దక్కింది. పార్టీ ప్రక్షాళనలో భాగంగా కర్నూలు జిల్లాలో జగన్ కు తలనొప్పులు తప్పేలా లేవు.
జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరిని కొనసాగిస్తూ మరొకరిని తప్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బుగ్గన కంటిన్యూ అవుతారనే తెలుస్తోంది. బీసీ మంత్రిగా ఉన్న జయరాంను తప్పిస్తే మరో బీసీ ఎమ్మెల్యే లేరు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందో లేదో చూడాల్సిందే. ఎస్సీల్లో తొగురు ఆర్థర్, డాక్టర్ సుధాకర్ ఉన్నారు. కానీ వీరికి మంత్రి పదవి దక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికే పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రాలయంలో సీనియర్ నాయకుడు బాల నాగిరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వంటి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ముగ్గురు కూడా సీనియర్లే కావడంతో ఎవరికి మంత్రి పదవి వస్తుందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాయిప్రసాద్ రెడ్డి రెండుసార్లు, బాల నాగిరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిద్దరు సోరదులే కావడంతో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందోనని చూస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో పార్టీలో చేరిన సమయంలోనే ఎమ్మెల్సీ పదవి వదులుకోవడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది.