Road Accident Kadapa: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో లారీ, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి, ఓ వ్యక్తి ఉన్నారు. వీరంత కారులో రాయచోటి నుంచి కడపకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.