
ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్- డీజిల్ ధరలను రెండు రోజుల విరామం తరువాత ఈరోజు పెంచాయి. దేశంలోని నాలుగు ప్రముఖ నగరాలలో పెట్రోల్ ధర 31నుంచి 39 పైసల వరకు, డీజిల్ ధర 15 నుంచి 21 పైసల వరకూ పెరిగింది. ఈ పెరిగిన ధరలతో పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డుకు చేరుకున్నాయి. రాష్ట్ర రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 101.54 పైసలకు చేరగా, డీజిల్ ధర 89,87 పైసలకు చేరింది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర 107.54 పైసలకు చేరగా, డీజిల్ ధర రూ. 97.45 పైసలకు చేరింది. కోల్ కతాలో పెట్రోల్ లీటరు ధర రూ. 101.54 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ. 89.87 పైసలుగా ఉంది.