
వరుసగా రెండో రోజు చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచాయి. జూన్ లో గడిచిన ఏడు రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పైకి కదిలాయి. ఇప్పటికే ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరగా తాజాగా లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై లీటర్ కు 30 పైసలు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 95.31, డీజిల్ రూ. 86,22కు చేరింది. ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.52, డీజిల్ రూ. 93.58కు పెరిగింది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 99.05, డీజిల్ రూ. 94కు చేరింది. గత నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నుంచి ఇప్పటి వరకు 20 సార్లు ధరలు పైకి కదిలాయి.