
చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. చమురు కంపెనీలు మరోసారి ధరలు పెంచాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ పై 13 నుంచి 29 పైసలు, డీజిల్ పై 29 పైసలు పెరిగింది. మే నెలలో ధరలు పెరగడం 12వ సారి. మొత్తంగా తాజాగా పెరిగిన ధరలతో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రూ. 100కు దగ్గరైంది. లీటర్ పెట్రోల్ రూ. 99.49 పైసలు, డీజిల్ ధర రూ. 91.30 పైసలకు చేరుకుంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 96.88, డీజిల్ రూ. 91.65 చేరుకుంది. వ్యాట్ తదితర కారణాల వల్ల చమురు ధరల్లో తేడాలు ఉంటాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్,తదితర కొన్ని నగరాల్లో పెట్రోల్ లీటర్ వంద రూపాయలకు చేరుకుంది.