
చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్ ధరలను పెంచాయి. 12.2కిలోల బరువున్న సబ్సిడీ సిలిండర్ పై రూ. 25.50 పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అములులోకి వస్తాయని స్పష్టం చేశాయి. పెంచిన ధరతో దేశ రాజధానిలో సిలిండర్ ధర రూ. 834.50. కు చేరింది. హైదరాబాద్ లో వంట గ్యాస్ సిలిండర్ పై రూ. 16 పెరిగింది. పెంపుతో రూ. 877.50కు చేరింది.