
ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లకు రిషబ్ పంత్ కెప్టెన్ గా కొనసాగుతాడని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ ప్రకటించింది. ఐపీఎల్ మొదటి సీజన్ లో రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు గాయం కావడంతో తప్పుకున్నాడు. దీంతో పంత్ ను సారథిగా ఎంపిక చేశారు. ఇప్పుడు అయ్యర్ కోలుకోవడంతో కెప్టెన్ గా కొనసాగించాలనే దానిపై చర్చ నడిచింది. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ.. పంత్ సారథిగా ఉంటాడని అధికారిక ప్రకటన చేసింది.