Madras High Court: ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు గోప్యత హక్కు సంపూర్ణంగా పరిగణించడం కుదరదని పేర్కొంది. సమాజానికి కలిగే హానిని అడ్డుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని వ్యాఖ్యనించింది. ఇటీవల ఆన్ లైన్ గేమ్ లపై తమిళనాడు ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ.. గేమింగ్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేసింది.